Homeజిల్లాలుశ్రీ సత్యసాయిబస్సు దగ్దం సంఘటన బాధాకరం:- సిపిఐ కార్యదర్శి వేమయ్య యాదవ్

బస్సు దగ్దం సంఘటన బాధాకరం:- సిపిఐ కార్యదర్శి వేమయ్య యాదవ్

- Advertisement -

విశాలాంధ్ర పుట్టపర్తి : – కర్నూలు శివారు లో ప్రైవేటు బస్సు దగ్దమై పదుల సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందడం బాధాకరమని శ్రీ సత్య సాయి జిల్లా సిపిఐ కార్యదర్శి వేమయ్య యాదవ్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సు దగ్దమై 20 మంది ప్రయాణికులు మరణించడం,పలువురుకి తీవ్ర గాయాలు కావడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.హైదరాబాదు నుండి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని,మృత దేహాలను స్వగ్రామాలకు వెంటనే తరలించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు .గాయపడిన క్షతగాత్రులకు అత్యవసర చికిత్స అందించి ప్రభుత్వం ఆదుకోవాలి అన్నారు. మృతుల కుటుంబాలకు,క్షతగాత్రులకు నష్ట పరిహారం చెల్లించాలని ఆయన కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు