Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రతి ఒక్కరూ సేవా గుణమును అలవర్చుకోవాలి.. కన్వీనర్ నామా ప్రసాద్

ప్రతి ఒక్కరూ సేవా గుణమును అలవర్చుకోవాలి.. కన్వీనర్ నామా ప్రసాద్

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం:: ప్రతి ఒక్కరూ సేవా గుణమును అలవర్చుకోవాలని శ్రీ సత్య సాయి సేవ సమితి- గాంధీనగర్ కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గల రోగులకు, సహాయకులకు భోజనపు ప్యాకెట్లను వాటర్ ప్యాకెట్స్ లను ఆసుపత్రి సిస్టర్లచే పంపిణీ చేశారు. అదేవిధంగా గర్భిణీలకు ప్రత్యేకంగా స్వీట్లు కూడా పంపిణీ చేశారు. అనంతరం కన్వీనర్ నామా ప్రసాద్ మాట్లాడుతూ 360 మందికి భోజనపు ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. నేటి ఈ సేవా కార్యక్రమానికి దాతగా కీర్తిశేషులు ఆవులకుష్టప్ప జ్ఞాపకార్థం కుమారుడు శ్రీనివాసులు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటువంటి సేవా కార్యక్రమాలకు దాతలు సెల్ నెంబర్ 9966047044కు గాని 9030444065కు గాని సంప్రదించారని తెలిపారు.అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తిపేంద్ర నాయక్ మాట్లాడుతూ శ్రీ సత్య సాయి సేవ సమితి వారు చేస్తున్న సేవలు ఎంతో మందికి స్ఫూర్తినిస్తాయని తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలకు పట్టణములోని దాతలు కూడా ముందుకు రావాలని వారు విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి తరఫున వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 27 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు