ఋషి విద్యాలయ పాఠశాల ప్రిన్సిపాల్ కరణ్ స్వరూప సింగ్
విశాలాంధ్ర ధర్మవరం:: విద్యార్థులలో సృజనాత్మకతను వెలికి తీయడమే మా లక్ష్యము అని రుషి విద్యాలయ ప్రిన్సిపాల్ కరణ్ స్వరూప సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులకు ఆర్ట్స్ తో పాటు చిత్రలేఖనములో పోటీలను నిర్వహించారు. అనంతరం మొదటి మూడు బహుమతులతో పాటు పాల్గొన్న వారందరికీ కూడా ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. అనంతరం ప్రిన్సిపాల్ కరెంట్స్వరూపాసింగ్ మాట్లాడుతూ చదువుతోపాటు సృజనాత్మక శక్తి ఎంతో అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు కూడా పాల్గొనడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ భాస్కర్, సీఈఓ రవీంద్ర, వైస్ ప్రిన్సిపాల్ కళ్యాణి, ఏవో రంగారెడ్డి పాల్గొన్నారు.
విద్యార్థులలో సృజనాత్మకతను వెలికి తీయడమే మా లక్ష్యం..
- Advertisement -
RELATED ARTICLES


