Homeఆంధ్రప్రదేశ్అధికారులు అప్రమత్తంగా

అధికారులు అప్రమత్తంగా

- Advertisement -

మొంథా తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి

విశాలాంధ్ర – రాజ‌మండ్రి సిటి :  మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. మంగళవారం అన్ని విభాగాల అధికారులు, సచివాలయ సిబ్బందితో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే రెండు, మూడు రోజుల్లో తుఫాన్ పరిస్థితిని అంచనా వేసుకుని తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ చిన్న సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. ముఖ్యంగా విద్యుత్‌ సరఫరా సహా అన్ని కీలక వ్యవస్థలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రమాదకర హోర్టింగులను వెంటనే తొలగించాలన్నారు. కూలిన చెట్లను తొలగించడంతో పాటు అవసరమైన చోట చెట్ల కొమ్మలను కత్తిరించాలన్నారు. కంట్రోల్‌ రూమ్‌ (9494060060) నెంబర్ 24 గంటలూ పనిచేయాలన్నారు. అలాగే పునరావాస కేంద్రాలలో తగిన ఆహారం, త్రాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని,  ప్రభుత్వ సహాయక చర్యలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు