Homeఆంధ్రప్రదేశ్స్వదేశీ కార్యక్రమంపై కంబాల

స్వదేశీ కార్యక్రమంపై కంబాల

- Advertisement -

ప్రతి ఇంటా స్వదేశీ, ఇంటింటా స్వదేశీ కార్యక్రమంపై అవగాహన కలిపించిన కంబాల.

 విశాలాంధ్ర –  గోకవరం :  ప్రతి ఇంటా స్వదేశీ, ఇంటింటా స్వదేశీ అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి స్వదేశీ వస్తువుల చిహ్నంగా మార్చాలని  స్వదేశీ ఉత్పత్తులను గర్వంగా ఉపయోగించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు స్వదేశీ వస్తువులు వల్ల కలిగే ఉపయోగాలు, వాటివల్ల మన దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది. అనే పలు అంశాలపై గోకవరం తంటికొండ రోడ్డులోని సీఎండీ కార్యాలయం వద్ద మంగళవారం ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం, దేశీయంగా తయారైన వస్తువుల తయారీదారులకు, వ్యాపారులకు, మరియు వినియోగదారులకు మద్దతు ఇవ్వడం ద్వారా దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. భారతదేశంలో తయారు చేయబడిన వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రజలను ప్రోత్సహించడం. దేశ యువత, కార్మికుల కష్టానికి, నైపుణ్యానికి విలువ ఇవ్వడం విదేశీ వస్తువులపై ఆధారపడటాన్ని తగ్గించడం దేశంలోని చిన్న వ్యాపారవేత్తలు, చేతివృత్తులవారిని ఆదుకోవడం దేశీయ ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం జరుగుతుందని వివరించారు. కావున ప్రతి ఒక్కరూ స్వదేశీ వస్తువులు వాడాలని ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు  కోరారు. అనంతరం ప్రతి ఇంటా స్వదేశీ, ఇంటింటా స్వదేశీ స్టిక్కర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు వరసాల ప్రసాద్, బత్తుల నానాజీ, దాసరి ధర్మరాజు, పెద్దడా వెంకన్న దొర, పసల గణేష్, దేశాల నరేష్, దోసపాటి సుబ్బారావు, మండే గౌతమ్, తటికొండ సురేష్,  తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు