Homeఆంధ్రప్రదేశ్ప్రజలు శ్రేయస్సు కై కంబాల

ప్రజలు శ్రేయస్సు కై కంబాల

- Advertisement -

ప్రజలు శ్రేయస్సు కై పవిత్రమైన కార్యం

– తోకాడ శివాలయ నిర్మాణానికి లక్ష విరాళం

-విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల

విశాలాంధ్ర – రాజానగరం : తమ ప్రాంత వాసులు  సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో మెలగాలనే ఉద్దేశ్యంతో ప్రజా శ్రేయస్సు కై వివిధ పవిత్ర కార్యాలు చేపడుతున్నామని విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు,బీజేపీ ముఖ్య నాయకులు కంబాల శ్రీనివాసరావు అన్నారు. రాజానగరం మండలంలోని తోకాడ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయానికి కంబాల శ్రీనివాసు తన సొంత నిధులు నుండి లక్ష రూపాయలకు సంబంధించి చెక్కు ను ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. స్తానిక శివాలయం ఆలయ శంకుస్థాపనకు గతంలో విచ్చేసిన సమయంలో కమిటీ సభ్యులు కోరిక మేరకు లక్ష రూపాయలు హామీ ఇవ్వడంతో ఆ హామీని నెరవేర్చు కున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ఆలయాలు అభివృద్ధికి తమ వంతు సహాయం చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ  కార్యక్రమంలో కమిటీ సభ్యులు వేగిసేట్టి చక్రం, సత్తిబాబు,దుర్గారావు,రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు