విశాలాంధ్ర ధర్మవరం;; ఎస్ జి ఎఫ్ డివిజన్ స్థాయి పోటీలలో గొట్లూరు గ్రామం జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ విద్యార్థులు మంచి ప్రతిభను ఘనపరచడం జరిగిందని హెడ్మాస్టర్ జగన్నాథం తెలిపారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ జగన్నాథము పిడిఏ రమేష్ బాబు మాట్లాడుతూ ఈనెల 20 ఏడవ తేదీన ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జరిగిన ఎస్జిఎఫ్ మండల స్థాయి పోటీలలో మా విద్యార్థులు డివిజన్ స్థాయి పోటీలకు అర్హత సాధించారని తెలిపారు. అర్హత సాధించిన విద్యార్థులలో 200 మీటర్లు పరుగుపందెంలో అండర్ 17 బాలికల విభాగంలో తేజశ్రీ రెండవ స్థానం 400 మీటర్ల పరుగు పందెంలో అండర్ 17 బాలికల విభాగంలో తేజశ్రీ మొదటి స్థానం, 400 మీటర్ల పరుగు పందెం అండర్ 17 బాలికల విభాగంలో స్వాతి రెండవ స్థానం, బాలుర విభాగములో జాకీర్ మొదటి స్థానం, హై జంప్ అండర్ 17 బాలికల విభాగంలో తేజశ్రీ మొదటి స్థానం, జావిలిన్ త్రో అండర్ 17 బాలికల విభాగంలో తేజశ్రీ రెండవ స్థానం సాధించారని తెలిపారు. అంతేకాకుండా 200 మీటర్లు అండర్ 17 బాలుర విభాగంలో హేమంత్ రెండవ స్థానం, బాలికల విభాగములో ప్రేమలత మూడవ స్థానం, జావిలిన్ త్రో అండర్ 17 బాలిక విభాగంలో స్వాతి మూడవ స్థానం కైవసం చేసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ తో పాటు పి డి ఏ రమేష్ బాబు ,పాఠశాల ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు, పాఠశాల కమిటీ, తోటి విద్యార్థులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.
క్రీడా పోటీలలో ప్రతిభ కనబరిచిన గొట్లూరు జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు
- Advertisement -
RELATED ARTICLES


