Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము

పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము

- Advertisement -

యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం

విశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము అని యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం, సహకార దర్శి గర్రి రమేష్ బాబు, క్యాంపు చైర్మన్ వంకదారి రామచంద్రగుప్త, పిఆర్వో రాధాకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణములోని స్వాతి క్లినిక్.. (డాక్టర్ సుబ్బారావు) లో కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఉచిత ఐఓఎల్ కంటి వైద్య శిబిరం యువర్స్ ఫౌండేషన్, జిల్లా ఆంధత్వ నివారణ సంస్థ శ్రీ సత్య సాయి జిల్లా, నేత్ర జ్యోతి కంటి ఆసుపత్రి బెంగళూరు వారి సహాయ సహకారములతో నవంబర్ రెండవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వైద్య శిబిరమునకు దాతలుగా కీర్తిశేషులు గంజికుంట విజయలక్ష్మి, కీర్తిశేషులు గంజికుంట రంగనాయకులు జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు గంజికుంట శ్రీధర్ బాబు అండ్ బ్రదర్స్ వారి కుటుంబం (శ్రీ రుక్మిణి సిల్క్ ఎంపోరియం ధర్మవరం) వారు వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. శిబిరమునకు వచ్చువారు ఆధార్ కార్డు, ఓటర్ ఐడి ,రేషన్ కార్డు జిరాక్స్ లతో పాటు ఫోన్ నెంబర్ తో చిరునామా వెంట తీసుకొని రావాలని తెలిపారు. కావున ఈ ఉచిత కంటి శిబిరాన్ని పట్టణములోని గ్రామీణ ప్రాంతాలలోని పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని కంటి వెలుగును ప్రసాదించుకోవలసినదిగా వారు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఉచితంగా వైద్య చికిత్సలతో పాటు ఉచితంగా ఆపరేషన్, ఉచితంగా కంటి అద్దాలు కూడా ఇవ్వబడునని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబ్బారావు, వై కే శ్రీనివాసులు కోటేశ్వరరావు, బండ్లపల్లి రంగనాథ్, కౌన్సిలర్ కేతాలోకేష్, బండి నాగేంద్ర, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు