నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు
విశాలాంధ్ర ధర్మవరం;; జిల్లా డిపిఈఓ ఆదేశాల మేరకు ధర్మవరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల వివిధ గ్రామాలలో అనధికార మద్యం దుకాణాలపై దాడులు నిర్వహించి నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి నుండి ఒక్కొక్క దగ్గర 10 మద్యం పార్టీలను స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్ సీఐ చంద్రమణి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరెస్టు చేయబడిన వ్యక్తులను కోర్టుకు తరలించగా జడ్జి రిమాండ్కు పంపడం జరిగిందన్నారు. ఎవరైనా మద్యం షాపుల నుండి గొలుసు దుకాణాలకు మద్యం విక్రయిస్తే అలాంటి షాపులపైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. లైసెన్స్ దారులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుందని వారు హెచ్చరించారు. కావున ప్రతి షాపు నుండి ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మద్యమును విక్రయించవలనని తెలిపారు. ఈ విషయాన్ని కొనుగోలు దారులు అందరూ తెలుసుకొని సురక్ష యాప్ ద్వారా వినియోగదారులు పరిశీలించుకొని మధ్యమును సేవించవలెనని తెలిపారు. ఎటువంటి అనుమానం మద్యం ప్రియులకు వచ్చినయెడల ఎక్సైజ్ సీఐ. చంద్రమణి సెల్ నెంబర్ 9440902562 కు తెలియజేయాలని తెలిపారు.
మద్యం దుకాణాలపై దాడులు..
- Advertisement -
RELATED ARTICLES


