విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ మండలం షేక్షన్ పల్లి,షేక్షన్ పల్లితాండ, కోనాపురం గ్రామాల్లో గురువారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ రచ్చబండి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి, విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు ప్రణయ్ రెడ్డి ఆదేశా లతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ప్రైవేటీకరణతో పేదలకు వైద్య విద్య అందుకుండా పోతుందని ఈ ప్రతిపాదనను ప్రభుత్వం విరమించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ రూరల్ మండల పార్టీ పరిశీలకులు డి. సురేష్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షులు ఎర్రిస్వామి రెడ్డి, ఎంపీపీ నరసింహులు, పార్టీ మండల నాయకులు ఈశ్వర్, ధనుంజయ, బీ సీ మళ్లీ, కే రమేష్,పూజారిప్ప, రెడ్డి గంజే గోపాల్, బన్నెల అయ్యప్ప రెడ్డి, వెంకటేష్ నాయక్, రామకృష్ణప్ప, బొజ్జప్ప, మరియు మూడు గ్రామాల్ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.


