ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ బి. గోపాల్ నాయక్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని స్థానిక కే.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని విద్యార్థులతో ఎన్.ఎస్.ఎస్. యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. బి. గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో గొట్లూరు గ్రామంలోని సచివాలయంలో ఎన్. ఎస్. ఎస్. ప్రత్యేక శిబిరం మొదటి రోజు ప్రారంభ కార్యక్రమము నిర్వహించామని ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్. బి. గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం 29 అక్టోబర్ నుండి 04నవంబర్ వరకు నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్, డా. కె ప్రభాకర్ రెడ్డి అధ్యక్షత వహించారు అని తెలిపారు. ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ జాతీయ సేవ పథకం లో భాగంగా అర్థాంతరంగా చదువు మానేసిన విద్యార్థులను గుర్తించి వారికి చదువు పట్ల అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ పి.నరసమ్మ పంచాయతీ కార్యదర్శి పి. గణేష్ కుమార్, గ్రామ మత్స్య సహాయాధికారి జీ.రామాంజనేయులు , గ్రామ ఉద్యానవన సహాయాధికారి సి. ఆశాజ్యోతి పాల్గొన్నారు. పలువురు వక్తలు ఎన్ ఎస్ ఎస్
విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామంలో ఉ ఉన్నతువంటి సమస్యపై ప్రతి విద్యార్థికి అవగాన ఉండాలని భవిష్యత్తు లో మంచి పౌరులు గా ఎదగడానికి సేవచేసే గుణం అలవర్చు కోవాలన్నారు. అంతే గాక విద్య పై అవగాహన, నిరక్షరాస్యత నిర్మూలన, పరిశుభ్రత, ఆరోగ్య అంశాలపై అవగాహన కల్పించి గొట్లూరు గ్రామంలో విద్యార్థులచే ర్యాలీ నిర్వహించడం శుభదాయకమన్నారు.
ఈ కార్యక్రమంలో ఎ. కిరణ్ కుమార్, డా. ఎస్. షమీఉల్లా, ఎస్.పావని, యం. భువనేశ్వరి, ఎం. పుష్పవతి, బి. ఆనంద్ తదితర అధ్యాపకులు, ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
గొట్లూరు గ్రామంలో ఎన్ ఎస్ ఎస్ ప్రత్యేక శిబిరం ప్రారంభం
- Advertisement -
RELATED ARTICLES


