Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లారైతన్నకు అండగా చంద్రన్న… ఎంపీ కేశినేని చిన్ని

రైతన్నకు అండగా చంద్రన్న… ఎంపీ కేశినేని చిన్ని

- Advertisement -

రైతుకు అండగా కూటమి ప్రభుత్వం… ఎమ్మెల్యే తంగరాల సౌమ్య

విశాలాంధ్ర నందిగామ:-రాష్ట్రంలో అన్నదాతలు ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాద్(చిన్ని) అన్నారు బుధవారం స్థానిక బాబు జగజ్జీవన్ రావు భవన్ నందు ఏర్పాటుచేసిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యురాలు ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య తో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ సెక్స్ లో భాగంగా అన్నదాత సుఖీభవ రెండో విడత డబ్బులు రైతుల ఎకౌంట్లో ఈరోజు జమ అయ్యాయని అన్నారు ప్రధానమంత్రి మోడీ 21వ సారి పీఎం కిసాన్ నిధులు విడుదల లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అందించే ఐదువేలతో కలిపి రైతుల అకౌంట్లో ₹7,000 నేడు జమ అయ్యాయని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమలులో ముందుకు నిలిచిందని అన్నారు అలాగే రైతుల కు పంటల అవగాహన గురించి ఆర్గానిక్ వ్యవసాయ కార్యక్రమాలు చేపట్టాలని దానిద్వారా రైతులు ఖర్చులు తగ్గించుకొని అధిక ప్రయోజనాలు పొందవచ్చని పేర్కొన్నారు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ రైతులకు పెద్దన్నయ్య చంద్రబాబు నిలుస్తున్నారని పేర్కొన్నారు అన్నదాత సుఖీభవ నిధులను నేడు విడుదల చేయటం రైతుల ఇబ్బందుల సమయంలో ఇవి ఎంతగానో వారికి ఉపయోగపడతాయని అన్నారు అలాగే ప్రతి కొనుగోళ్ల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లుగా ఆమె తెలిపారు కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వంగా నిలుస్తుందని అన్నారు అంతకుముందు రైస్ సంస్థ ద్వారా రైతులకు ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రయోజనాలను అలాగే పాడి ప్రయోజనాల ను సంబంధిత అధికారుల ద్వారా రైతులకు వివరించారు రైతులతో కలిసి సహపంక్తి భోజనాలు నిర్వహించారు అనంతరం కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరినీ దుశ్యాలువాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పిసి చైర్మన్ కోటా వీరబాబు,కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి బాబు,రైతు సంఘం నాయకులు పోతుల బాలకోటయ్య,నందిగామ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అమ్మినేని జ్వాల ప్రసాద్, డైరెక్టర్ మనబోతుల శ్రీరామ్,విజయవాడ కనకదుర్గ ఆలయ డైరెక్టర్ కళావతి, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ సజ్జా అజయ్,డీసీ చైర్మన్లు,నాలుగు మండలాల అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు,రైతులు కూటమి నాయకులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు