Homeఆంధ్రప్రదేశ్వైజ్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో

వైజ్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో

- Advertisement -

అక్షరాస్యత అనియత విద్యపై ప్రజలకు అవగాహన కార్యక్రమం 

విశాలాంధ్ర – నల్లజర్ల : వైజ్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో  వారం రోజుల పాటు ఆవపాడు, ప్రకాశరావుపాలెం, నల్లజర్ల, తెలికచర్ల, సింగరాజుపాలెం గ్రామాల్లో చేపట్టిన ప్రత్యేక సేవా శిభిరంలో భాగంగా ఆరవ రోజు ప్రకాశరావుపాలెంలో అక్షర విజ్ఞానం, అక్షరాస్యత, అనియత విద్య తదితర అంశాలపై ర్యాలీ నిర్వహించి, ఇంటింటా అవగాహన కలిగించారు.  కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు గ్రామంలో లిటరసీ రేటు, వయోజనుల్లో అక్షరాస్యత,  మహిళా అక్షరాస్యత శాతం పై ఇంటింటా వివరాలు సేకరించారు. నిరక్షరాస్యులకు  ప్రభుత్వం తరపున అందిస్తున్న అక్షరాస్యత కార్యక్రమాలు, కళాశాల తరపున చేపట్టనున్న వయోజన విద్యా కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు