విశాలాంధ్ర – కడియం : కడియం మండలం దుళ్ల దళితవాడ లో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికంగా నివాసముండే గుర్రపు వెంకట్రావు శుక్రవారం సాయంత్రం ఎప్పటిలాగే వ్యవసాయ కూలి పనికి వెళ్లి వచ్చి టివి ఆన్ చేసి చూస్తూ నిద్రకు ఉపక్రమించినట్లు, అయితే టివి ఆఫ్ చేయడం మరచిపోవడం వల్ల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి వుండొచ్చని భావిస్తున్నారు. ఇల్లంతా పొగ కమ్మేయడంతో గాఢనిద్రలో ఉన్న వెంకట్రావుకు మెలకువ వచ్చి, బయటకు పరుగెత్తడంతో స్వల్ప గాయాలుతో బయట పడ్డారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేక పోవడం, డాబా ఇల్లు కావడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ ఇంట్లోని ఫర్నీచర్, ఎలక్ట్రిక్ వస్తువులు, దుస్తులు, అపరాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సమాచారం తెలుసుకున్న వెంకట్రావు సోదరుడు, మాజీ సర్పంచి గుర్రపు కొండయ్య మాష్టారు, చుట్టు ప్రక్కలవారు ప్రమాద స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసారు.
దుళ్ల లో అగ్ని ప్రమాదం
- Advertisement -
RELATED ARTICLES


