Homeజిల్లాలువిజయనగరంసుందరం మందిరంలో బాలవికాస్ దినోత్సవ వేడుకలు

సుందరం మందిరంలో బాలవికాస్ దినోత్సవ వేడుకలు

- Advertisement -

విశాలాంధ్ర-రాజాం(.విజయనగరం జిల్లా) : రాజాం సుందరం మందిరంలో శుక్రవారం సాయంత్రం బాలవికాస్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలవికాస్ చిన్నారులు వివిధ ఉపన్యాసాలు, విలువలతో కూడిన సందేశాత్మక కార్యక్రమాలు ప్రదర్శించారు. ప్రత్యేక ఆకర్షణగా చిన్నారులు ప్రదర్శించిన “సర్వధర్మ ప్రియదేవ” నాటిక ప్రేక్షకులను అలరించింది.
పిల్లల ప్రతిభను అభినందించిన నిర్వాహకులు, కళారంగంలో, నీతి-మూల్యాలపై అవగాహన కల్పించేలా బాలవికాస్ అందిస్తున్న శిక్షణను ప్రశంసించారు. కార్యక్రమం ముగింపులో చిన్నారులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్త కొత్తా శ్రీనివాసరావు, కొల్లా కృష్ణారావు, శీమకుర్తి ప్రసాదరావు, వైయస్సార్సీపి రాజాం పట్టణ అధ్యక్షులు పాలవలస శ్రీనివాసరావు, బాలవికాస్ టీచర్లు ఎస్. శ్రీదేవి, ఎస్. శారద తదితరులు పాల్గొన్నారు. సుందరం నిర్వాహకులు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు