సహాయ వ్యవసాయ సంచాలకులు లక్ష్మానాయక్
విశాలాంధ్ర ధర్మవరం;; వ్యవసాయ శాఖలో అమలవుతున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సహాయ వ్యవసాయ సంచాలకులు లక్ష్మానాయక్, వ్యవసాయ అధికారి ముస్తఫా తెలిపారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని పోతుకుంట గ్రామం వద్ద రైతన్న మీకోసం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి ప్రస్తరించార్జ్ మహేష్ చౌదరి కూడా పాల్గొన్నారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ వ్యవసాయ శాఖలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ ముఖ్యమంత్రి సందేశాన్ని కూడా వివరించడం జరిగిందని తెలిపారు. రైతులకు ప్రభుత్వం అందజేస్తున్న వివిధ సేవలు, అన్నదాత సుఖీభవ, రాయితీపై డ్రిప్పు పరికరాలు, పొలం పిలుస్తోంది మొదలైన పథకాలు గూర్చి తెలియజేయడం జరిగిందని తెలిపారు. తదుపరి రైతుల యొక్క సమస్యలను అడిగి తెలుసుకుని సచివాలయ సిబ్బంది ద్వారా తెలియజేశారు. అనంతరం గ్రామాల్లో పర్యటించి రైతుల వివరాలు సేకరించాల్సి ఉందని కావున రైతు సోదరులు కూడా సచివాలయ ఉద్యోగులకు సహకార అందించాలని వారు తెలిపారు.
వ్యవసాయ శాఖలో అమలవుతున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి..
- Advertisement -
RELATED ARTICLES


