ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి మహోత్సవాలు.
విశాలాంధ్ర – కడియం : కడియం శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గల శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి మహోత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. వంశపారంపర్య ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో తెల్లవారుజామునుండే ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని పూలు, పడగలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కడియం స్వామివారి రధోత్సవంలో భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మండలంలోని కడియం, బుర్రిలంక, వేమగిరి, జేగురుపాడు, మురమండ, వీరవరం, బుర్రిలంక, పొట్టిలంక గ్రామాలలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయాల వద్ద భక్తులు క్యూలైన్లులో ఎక్కడికక్కడ బారులు తీరారు. ప్రమాదాలు జరగకుండా కడియం పోలీసు వారు బందోబస్తు నిర్వహించారు.


