Homeఆంధ్రప్రదేశ్చంటి భూరి విరాళం

చంటి భూరి విరాళం

- Advertisement -

మురమండలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన.
— అన్నందేవుల చంటి భూరి విరాళం.

కడియం : కడియం మండలం, మురమండ గ్రామం, దొరగారి తోట కాలనీలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి, శంకుస్థాపన కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. కాలనీ కి చెందిన రాజాన మాలునాయుడు దేవి దంపతులతో, పురోహితులు నాగదేవర విశ్వనాథ శర్మ శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్భంగా రాజాన మాలునాయుడు మాట్లాడుతూ దాతల సహకారంతో విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని, మాధవరాయుడు పాలెం సర్పంచ్ అన్నందేవుల చంటి విగ్రహ నిర్మాణ నిమిత్తం 50 వేల రూపాయలు కమిటీ సభ్యులకు అందజేశారని, వారికి కమిటీ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్తి భాస్కరరెడ్డి, ప్రత్తిపాటి రామారావు చౌదరి, వట్టికూటి జానకి రామయ్య, దేవళ్ళ రామ్మోహన్రావు, గన్ని రామారావు, ఈదర దీనదయాళ్, అయినవల్లి రుక్మిణీ వెంకటేశ్వరరావు, ముద్రగడ జెమినీ, రత్నం అయ్యప్ప, చెక్కపల్లి మురళీకృష్ణ, తూము శ్రీను, సూరంపూడి భరత్, అధిక సంఖ్యలో భక్తులు మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు