పూల పరిశోధన కేంద్రం ను సందర్శించిన ఎంపీ దగ్గుబాటి.
విశాలాంధ్ర – కడియం : కడియం మండలం, వేమగిరి గ్రామంలో గల ఐసిఏఆర్ పూల పరిశోధన కేంద్రాన్ని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి బుధవారం సందర్శించారు. పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ డివీఎస్ రాజు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సాయిల్ లెస్ మీడియా, ఆర్కిడ్ రకాలు, చీడపీడలు, తెగుళ్ల నియంత్రణ పద్ధతులు, జీవనియంత్రణ పద్ధతుల గురించి శాస్త్రవేత్తలు డాక్టర్ రాంపాల్, డాక్టర్ లక్ష్మీపతి, డాక్టర్ శిరీష, డాక్టర్ మాధవన్ ఎంపీ దగ్గుబాటి కి వివరించారు. పూల సాగు, నర్సరీ రైతులకు తరచుగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని శాస్త్రవేత్తలుకు ఎంపీ సూచించారు. పూల పరిశోధన ప్రాంతీయ కేంద్రం యొక్క రీసెర్చ్ ఫార్మ్ , లేబరేటరీనీ పరిశీలించారు. పరిశోధన కేంద్రం కు కావలసిన సదుపాయాలను సమకూర్చే నిమిత్తం కేంద్ర వ్యవసాయ శాఖ ద్వారా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, కూటమి నాయకులు పిక్కి నాగేంద్ర, ఉన్నికృష్ణ , పరిమి రాధ, ఆకుల శ్రీధర్, నాగులాపల్లి వీరబాబు, గుత్తుల హరిప్రసాద్ పలువురు నర్సరీ రైతులు పాల్గొన్నారు.


