Homeజిల్లాలుఅనంతపురంసీపీఐ శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయండి

సీపీఐ శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయండి

- Advertisement -

రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్..
విశాలాంధ్ర- అనంతపురం : భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) అనంతపురం నగర జనరల్ బాడీ సమావేశం గురువారం వి.కె. మెమోరియల్ హాల్‌లో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి నగర కార్యదర్శి ఎన్. శ్రీరాములు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్, జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పి. నారాయణ స్వామి పాల్గొన్నారు. ఈ సంద్భంగా జగదీష్ మాట్లాడతు… భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) 100 ఏళ్ల ప్రయాణం ఒక అపూర్వ పోరాట గాథ. 1925లో ప్రజా సమస్యలను అజెండాగా పెట్టుకుని ఏర్పడిన సీపీఐ,కూలీలు,రైతులు,విద్యార్థులు,మహిళలు,అట్టడుగు వర్గాల హక్కుల కోసం దేశవ్యాప్తంగా భూస్వామ్య అణచివేతకు వ్యతిరేకంగా, కార్మికుల కనీస వేతనాల కోసం, రైతుల రుణమాఫీల కోసం, మహిళల స్వేచ్ఛ–భద్రత కోసం, యువతకు ఉపాధి అవకాశాల కోసం సిపిఐ నడిపిన పోరాటాలు భారత రాజ్యాంగ విలువలను బలపరిచాయి. సమానత్వం, సెక్యులరిజం, ప్రజాస్వామ్య రక్షణ, ఈ విలువలను కాపాడేందుకు పార్టీ ఎన్నో దశాబ్దాలుగా రాజ్యాంగవ్యాప్త దాడులను ప్రతిఘటిస్తూ ముందడుగు వేసింది.దేశ రాజకీయ పరిస్థితులపై ధ్వనించారు అని పేర్కొన్నారు. దేశ రాజకీయాలు ప్రమాదకర మలుపులోకి వెళ్తున్నాయి అని పేర్కొన్నారు. కార్పొరేట్ శక్తులు ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేస్తున్నాయన్నారు. భారత రాజ్యాంగ విలువలు – సెక్యులరిజం, సామాజిక న్యాయం, సమానత్వం ,సవాళ్లకు లోనవుతున్నాయి అని పేర్కొన్నారు. ప్రజల హక్కుల కోసం పోరాడే పార్టీలు, కార్మిక,రైతు ఉద్యమాలను అణచివేయడానికి ప్రభుత్వం ఏ హద్దుకైనా వెళ్తోందని హెచ్చరించారు.“సిపిఐ ప్రజాస్వామ్యం రక్షణలో కీలక బలగం. ప్రతి వార్డు, బస్తీ, ప్రతి కుటుంబంలో పార్టీని మరింత బలపరచడం మనందరి బాధ్యత. అన్యాయాలు, అవినీతి, హింస, సామాజిక ద్వేషం,ఇవన్నిటికి వ్యతిరేకంగా ప్రజాపక్ష పోరాటాలు మరింత బలపడాలి.” కోరారు
జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పి. నారాయణ స్వామి రాష్ట్రంలో పాలన ప్రజల అంచనాలకు విరుద్ధంగా నడుస్తున్నదని అన్నారు. రైతుల వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్నా ఎం ఎస్ పి లేదు. యువత ఉద్యోగాల కోసం తలుపుతట్టి అలసిపోతున్నారు. డి ఎస్ సి, గ్రూప్ భర్తీలలో ఆలస్యం ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. అనంతపురం జిల్లాలో పొలాలు ఎండి పోతున్నాయని, పట్టణాలలో ప్రజలు నీటి కోసం విలవిలలాడుతున్నారన్నారు.. మున్సిపాలిటీల్లో అవ్యవస్థ, రహదారులు చెడిపోవడం, కాల్వలు కుప్పకూలడం, హౌసింగ్ సమస్యలు ప్రజల రోజువారీ జీవనాన్ని దెబ్బతీస్తున్నాయి అని పేర్కొన్నారు. సిపిఐ ప్రజలతో కలిసి ప్రతి సమస్యపై ఉద్యమం కొనసాగిస్తూ, ప్రజల పక్షాన విలువైన పోరాటాలు నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 10న జరగబోయే సీపీఐ శతాబ్ధ ఉత్సవాలను ఘనంగా విజయవంతం చేయడానికి ప్రతి పార్టీ సభ్యులు, కార్యకర్తలు, ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు లింగమయ్య జి. సంతోష్ కుమార్ రాజేష్ గౌడ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు హనుమంతు జిల్లా సమితి సభ్యులు అలీ పీరా, వరలక్ష్మి, చిత్రసేడు రామాంజి ఎల్లుట్ల నారాయణస్వామి, బంగారు భాష,చంద్ భాష, ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్ శ్రీనివాస్, మంజునాథ్, నగర నలుమూలల నుంచి. పార్టీ శ్రేణులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు