రాబోయే సవంత్సరoకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి
విశాలాంధ్ర – సీతానగరం: మండలంలో గల స్త్రీ సమాఖ్య భవనంలో గురువారం యాన్యుల్ యాక్షన్ ప్లాన్ 2 తయారు చేయుటకు 59 మంది మండల సమాఖ్య కార్య నిర్వాహక సభ్యులుకు 4 రోజులు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఏ పి ఎమ్ జిలానీ అన్నారు. ఈ సందర్భంగా జిలానీ మాట్లాడుతూ 8 అంశాల పట్ల ప్రత్యేక శిక్షణలో చర్చించి ప్రణాళిక సిద్ధం చేయాలని అంశాల వారిగా వివరించడం జరిగింది అని అన్నారు. వీటిలో ఆరోగ్యం, విద్యా, వ్యవసాయం, సంపద సృష్టి, ప్రవర్తనలో మార్పు, సుస్థిర జీవనోపాదులు,సామాజిక భద్రత వంటి అంశాలు మీద రాబోయే సంవత్సర కాలంలో మన గ్రామ సంఘం సభ్యులకు ఏమి అవసరమో అనేది ప్రణాళిక సిద్ధం చేయాలని తద్వారా కావలసిన సొమ్ము ముందుగా అంచనా వేసి బడ్జెట్ అంచనా తయారు చేసి తీర్మాబం చేయాలని తదుపరి యన్ ఆర్ ఎల్ ఎం వారికి నివేదిక పంపడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షులు కందికట్ల అరుణ కుమారి, కార్యదర్శి రోంగలి దుర్గా దేవి నాయుడు, సీసీ హరిబాబు, లక్ష్మీ, వెంకట లక్ష్మీ , గ్రామ సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు


