సత్యదేవ నర్సరీని సందర్శించిన ఒరిస్సా ఎన్నికల అధికారులు.
విశాలాంధ్ర – కడియం : కడియం మండలం కడియపులంక శ్రీ సత్యదేవ నర్సరీని ఒరిస్సా జిల్లా పరిషత్ ఛైర్మన్ మరియు సర్పంచ్ ఎన్నికల అధికారుల బృందం గురువారం సందర్శించింది. నర్సరీ రైతు పుల్లా పెద్ద సత్యనారాయణ వారికి మొక్కలు ఇచ్చి స్వాగతం పలికారు. ఇక్కడి మొక్కలు ప్రకృతిలో సంభవిస్తున్న కాలుష్యాన్ని పూర్తిగా నియంత్రిస్తున్నాయని వారికి వివరించారు. నర్సరీలో పలు రకాల మొక్కల శాస్త్రీయ నామాలు, వాటివల్ల ఉపయోగాలను వారు అడిగి తెలుసుకున్నారు. వివిధ పండ్ల జాతి మొక్కలతో పాటు సప్త వర్ణ దళాలు, పుష్పాలు చూపరులను కనువిందు చేస్తున్నాయన్నారు. మొక్కలను పరిశీలించి ప్రపంచంలో గల వింతైన మొక్కలు ఉత్పత్తి చేస్తున్న సత్యదేవ నర్సరీ రైతు పుల్లా పెద్ద సత్యనారాయణ ను అభినందించారు. కడియం నర్సరీ అందాలు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలోఎస్ భాస్కర్ నాయక్, కితీష్ మిశ్రా, సోవురవ్ కుమార్, పుల్లా రామకృష్ణ, కడియం ఎంపిడిఓ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.


