జిల్లాలో స్కూల్ బస్సుల ప్రత్యేక డ్రైవ్ – నవంబర్ 28 నుంచి డిసెంబర్ 4*
*భద్రతా తనిఖీలు & ప్రధాన ప్రమాణాలు*
*బస్సు తనిఖీ లు యాజమాన్యాల బాధ్యత – లోపాలు కనపడితే కఠిన చర్యలు*
జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్
విశాలాంధ్ర – రాజమహేంద్రవరం : తూర్పు గోదావరి జిల్లాలోని విద్యాసంస్థల స్కూల్ బస్సుల భద్రతా ప్రమాణాలను తనిఖీ చేయడానికి రవాణా శాఖ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 4 వరకు ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్లు జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్ తెలిపారు. గురువారం సాయంత్రం రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు దిశా నిర్దేశం పొందారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో 2,000 పైగా బస్సులు, నాలుగు ప్రత్యేక బృందాలు ఉదయం–సాయంత్రం సమయంలో క్షేత్ర స్థాయిలో తనిఖీ చేయనున్నారు. తనిఖీలలో ముఖ్యంగా పరిశీలించబడ్డ అంశాలు: వాహన రిజిస్ట్రేషన్, సీటింగ్ కెపాసిటీ, అనుమతులు అత్యవసర నిష్క్రమణలు, ఎస్కేప్ హాచ్, అత్యవసర విండోలు ఫైర్ డిటెక్షన్ & అగ్ని నిరోధక వ్యవస్థలు (FDAS, FDSS), అగ్నిమాపక పరికరాలు స్పీడ్ గవర్నర్ పనితీరు, ఆన్‌బోర్డ్ డయాగ్నస్టిక్స్ నివేదికలు జిల్లా రవాణా శాఖ విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ, లోపాలు కనిపిస్తే వెంటనే సరి చేయాలని, నియమాలు పాటించని వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే విద్యాసంస్థలు, తల్లిదండ్రులు కూడా పిల్లల రవాణా భద్రతా అంశాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భవిష్యత్తులో కూడా మార్గదర్శకాలు అనుసరించి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాల్సిన బాధ్యత యాజమాన్యా లదేనని అధికారులు స్పష్టం చేశారు.


