Homeఆంధ్రప్రదేశ్శిక్షణ కార్యక్రమం

శిక్షణ కార్యక్రమం

- Advertisement -

రైతు ఉత్పత్తిదారుల సంస్థ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం

విశాలాంధ్ర -కొవ్వూరు : కొవ్వూరు డిఆర్డిఏ సెర్ప్ మరియు హిఫర్ ఇంటర్నేషనల్ వారి భాగ్యస్వామ్యంతో రైతు ఉత్పత్తిదారుల సంస్థ సిబ్బందికి సుస్థిరత మరియు వృద్ధి శిక్షణ సమావేశం కొవ్వూరు వెలుగు కార్యాలయంలో గురువారం జరిగింది ఏపీఎంకే నిర్మల కుమారి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి డిఆర్డిఏ పిడి ఎన్ వీవీ ఎస్ మూర్తి డిఆర్డిఏ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సత్య నాయుడు హాజరయ్యారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులు గోపాలపురం పెరవలి నల్లజర్ల తాళ్లపూడి చాగల్లు కొవ్వూరు మండలాల నుండి 90 మంది హాజరయ్యారు. హిఫర్ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ డిఆర్డిఏ సెర్ప్ వారు రైతు ఉత్పత్తిదారుల సంఘ సభ్యులకు శిక్షణ మార్కెటింగ్ చూపుట కొరకు శిక్షణ ఇచ్చారు. డిఆర్డిఏ పిడి ఎన్ వివిఎస్ మూర్తి మాట్లాడుతూ ఎఫ్ పి ఓ లు కి స్వచ్ఛంద సంస్థ ద్వారా పలు సూచనలు చేస్తారని ఎఫ్ పి ఓ అంటే ఎలా ఉండాలి ఎలాంటి పంటలు పండించాలి పకృతి దెబ్బతినకుండా ఎలాంటి పంటలు పండించాలి ప్రకృతి వైపరీతాలు తట్టుకునే పంటలు పండించే వారిని ప్రోత్సహించాలి అని వ్యవసాయ అనుబంధ రంగాలు ఉన్నాయి పశు శాఖ శాఖ కోళ్లు పెంపకం చేపల పెంపకం పంటలకు వ్యాల్యూ ఎలా యాడ్ చేయాలి పకృతి వ్యవసాయం ఎలా చేయాలి అని రైతు ఉత్పత్తిదారుల సంఘం సభ్యులకు కి ప్రభుత్వం వెహికల్స్ కొనుగోలుకి సబ్సిడీ ఇస్తుందని చిన్న చిన్న యూనిట్లు పెట్టుకోడానికి కూడా సబ్సిడీస్తున్నారని తెలియజేశారు.డిఆర్డిఏ డిపిఎమ్స్ హేమంత్ సత్యవేణి , డిపిఎం ఏపీ సీఎం ఎన్ ఎఫ్ బి తాతారావు వ్యవసాయ అధికారి శ్రీనివాస్ అడిషనల్ డీపీఎం వల్లి ఏపీఎంస్ రాజ్ మాణిక్యం రామకృష్ణ శ్యామ్ మంగయ్య అమ్మ ఏ నిర్మల కుమారి ఆదినారాయణ ఎన్జీవోఎం కెనరా బ్యాంక్ మేనేజర్ వెలుగు సీసీలు సిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు