కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంపర్తి పరమేష్
విశాలాంధ్ర ధర్మవరం;; మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడమును వెంటనే ప్రభుత్వం ఆపాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంపర్తి పరమేశ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 590తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వైద్య విద్య కళాశాలలను పిపిపి విధానములో ఏర్పాటు చేయడం ద్వారా 3700 కోట్లు అభివృద్ధి ఖర్చు ఏటా 500 కోట్ల నిర్వహణ వ్యయం ఆదా అవుతుందని వారు తెలిపారు. సుమారు 60 సంవత్సరాల పాటు ప్రభుత్వ భూమి వనరులు ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లి వారికి ఆదాయ వనరులుగా మారే అవకాశం ఉంది అని వారు గుర్తు చేశారు. మేనేజ్మెంట్ కోట కింద ఒక్కొక్క సీటుకు 50 నుండి 60 లక్షల వరకు వసూలు చేసే అవకాశం ఉంది అని వారు గుర్తు చేశారు. ఇలాంటి అప్పుడు పేదవారికి ఉచిత వైద్య సేవలు అందని ద్రాక్షగా మారుతాయి అని తెలిపారు. విద్యా, వైద్యం అనేది ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగాలని అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. పేదల ఆరోగ్య సంరక్షణ పట్ల ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. కావున 10 నూతన మెడికల్ కాలేజీ లను పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలోనే నిర్మించి నిర్వహించాలని వారు కాంగ్రెస్ పార్టీనా కోరడం జరిగింది అని తెలిపారు.
మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ వెంటనే ఆపుదల చేయాలి
- Advertisement -
RELATED ARTICLES


