Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రాజెక్టు లక్ష్యం అనేది ఒక మంచి ప్లాట్ఫారం..

ప్రాజెక్టు లక్ష్యం అనేది ఒక మంచి ప్లాట్ఫారం..

- Advertisement -

ఎంపీడీవో సాయి మనోహర్.

విశాలాంధ్ర ధర్మవరం:; ప్రాజెక్ట్ లక్ష్యము అనేది ఒక మంచి ప్లాట్ఫారం అని ఎంపీడీవో సాయి మనోహర్, ఎం ఈ ఓ లు రాజేశ్వరి దేవి గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయంలో యంగ్ పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీడీవో సాయి మనోహర్, ఎం ఈ ఓ లు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్ మాట్లాడుతూ ప్రాథమిక స్థాయి నుంచి నుంచి స్కిల్స్ డెవలప్ చేసుకొనుటకు దానికి ఉపయోగపడుతుందని తెలియజేశారూ. ప్రాజెక్ట్ లక్ష్యం కింద చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం విద్యార్థుల నాయకత్వ లక్షణాలను కమ్యూనికేషన్ స్కిల్ ని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని తెలిపారు. తెలియజేశారు. పలు అంశాల పైన యంగ్ పార్లమెంటేరియన్ విద్యార్థులు చర్చించడం జరిగింది అని తెలిపారు. 21వ శతాబ్ద భారతదేశం యొక్క పాత్ర,, ప్లాస్టిక్ పొల్యూషన్,.సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు గురించి, లింగ భేద సమానత్వం మొదలగు అంశాలపై విద్యార్థులందరూ చర్చించడం జరిగింది అని తెలిపారు. ప్లాస్టిక్ పొల్యూషన్ పైన, ఎం జె పిపాఠశాల విద్యార్థు లు చక్కగా మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల నష్టాలు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ప్రజల్లో తీసుకురావాల్సిన చైతన్యము గురించి చక్కగా మాట్లాడడం జరిగింది అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మొదటి బహుమతి ఎం జె పి రేగాటి పల్లి విద్యార్థులు
రెండవ బహుమతి, కేజీబీవీ మోటుమర్ల విద్యార్థులు
మూడో బహుమతి, చిగిచెర్ల విద్యార్థులు గెలుచుకోవడం జరిగింది అని తెలిపారు. వీరందరికీ ఎంపీడీవో, ఎంఈఓ లు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏడి.నబి రసూల్ ,ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు