Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅఖిల భారత విద్యార్థి బ్లాక్ ఏఐఎస్బి రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి..

అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఏఐఎస్బి రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి..

- Advertisement -

జిల్లా ప్రధాన కార్యదర్శి పోతులయ్య
విశాలాంధ్ర ధర్మవరం;; డిసెంబర్ 10, 11వ తేదీలలో అనంతపురం నగరంలో అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఏఐఎస్బి రాష్ట్ర మహాసభలు నిర్వహించడం జరుగుతుందని ఏఐఎస్బి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతులయ్య రాష్ట్ర నాయకులు జగదీష్ ,పట్టణ నాయకులు మురళి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీనివాసులు చేతుల మీదుగా కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం పోతలయ్య మాట్లాడుతూ ఈ రాష్ట్ర మహాసభలో పూర్తిస్థాయిలో ఫీజు రియబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, సంక్షేమ హాస్టల్ల విద్యార్థులకు కాస్మోటిక్ మిస్ చార్జీలు పెంచాలని, జీవో నెంబర్ 77ను రద్దుచేసి ఉన్నత విద్యను కాపాడాలని వారు డిమాండ్ చేశారు. ఏఐఎస్బి అనేది సోషలిజం శాంతి అభ్యుదయం లక్ష్యాలతో వేయి 1951 జూన్ 25న నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏర్పాటుచేసిన ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా నూతన జాతీయ విద్యా విధానం రద్దుకై ఏఐఎస్బి పోరాటాలు నిర్వహిస్తోందని తెలిపారు. కావున విద్యార్థులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు