Homeజిల్లాలుశ్రీ సత్యసాయికే హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినికి జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి

కే హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినికి జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి

- Advertisement -

విశాలాంధ్ర- ధర్మవరం; శ్రీ సత్య సాయి బాబా జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం అయిన పుట్టపర్తి లోని శ్రీ సత్య సాయి బాబా ట్రస్ట్ వారు”రాష్ట్ర స్థాయి వ్యాస రచన – 2025″ పోటీలు నిర్వహించారు. వివిధ విభాగాల్లో విద్యార్థులకు వ్యాస రచన పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. డిగ్రీ స్థాయిలోని విద్యార్థులకు “నన్ను నేను మార్చుకుంటే ప్రపంచం మారుతుంది “అనే అంశం కేటాయించి వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మవరం పట్టణం లోని స్థానిక
కే.హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని విద్యార్థులు పలు బహుమతులు పొందారు. అందులో భాగంగా జిల్లా స్థాయిలో ప్రథమ సంవత్సరం బి.ఏ చదువుతున్న పి. నీరజ ప్రథమ స్థానం కైవసం చేసుకోవడం జరిగిందని ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కళాశాలల వారీ గా ఇంగ్లీష్ మీడియoలో సి. భాను ప్రకాష్ బీ.కాం తృతీయ సంవత్సరం ఎస్. దూద్ పీర్ బీ.కాం ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు వరుసగా ప్రథమ, ద్వితీయ బహుమతులు రావడం జరిగింది అని తెలిపారు. అదేవిధంగా తెలుగు మాధ్యమం లో చదువుతున్న ఎస్ .అలేఖ్య బి.ఏ ద్వితీయ సంవత్సరం విద్యార్ధినికి ప్రథమ బహుమతి పొందారని తెలిపారు. ఈ సందర్భంగా బహుమతులు పొందిన విద్యార్థులకు అధ్యాపక , అధ్యాపకేతర బృందం,
విద్యార్థులు అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు