విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని రేగాటిపల్లి రైల్వే గేట్ దగ్గర గల మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం (ఎం ఆర్ సి) ఆవరణములో డిసెంబర్ 11వ తేదీ నుండి 14వ తేదీ వరకు నాలుగు రోజులు పాటు సెటిల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు జి. కృష్ణ ప్రసాద్ (టీచర్), ఏ.రాజా తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆసక్తి గల సెటిల్ క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొనదలుచుకుంటే డిసెంబర్ 8వ తేదీ లోపల తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. మ్యాచు ఉదయం ఆరు గంటలకు ప్రారంభమగునని తెలిపారు. అంపైర్లు, ఆర్గనైజేషన్ లదే తుది నిర్ణయం అని తెలిపారు. షటిల్ టోర్నమెంటులో మంచి ప్రతిభ ఘనపరిచిన వారికి మొదటి బహుమతి 8000 రూపాయలు, రెండవ బహుమతి 5000 రూపాయలు, మూడవ బహుమతి 3000 రూపాయలు, నాలుగవ బహుమతి 2000 రూపాయలు ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9985256682 గాని 9573181307కు గాని సంప్రదించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని షటిల్ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
షటిల్ టోర్నమెంట్ నిర్వహణ.. నిర్వాహకులు జి.కృష్ణ ప్రసాద్
- Advertisement -
RELATED ARTICLES


