Homeజిల్లాలుకర్నూలుకూటమి ప్రభుత్వంలోనే రైతు ఆర్థికంగా అభివృద్ధి

కూటమి ప్రభుత్వంలోనే రైతు ఆర్థికంగా అభివృద్ధి

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : కూటమి ప్రభుత్వంలోనే రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని టిడిపి మండల ఆర్గనైజింగ్ కార్యదర్శి గోనుమాను నరసన్న, కోసిగి మార్కెట్ యార్డు డైరెక్టర్ కలుగొట్ల లక్ష్మన్న అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చిన్నకడబూరులో రైతన్నా మీ కోసం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు ఇంటింటికీ తిరుగుతూ కూటమి ప్రభుత్వం రైతులకు చేస్తున్న పథకాల గురించి వివరించారు. కూటమి ప్రభుత్వం రైతుల పెట్టుబడి కోసం అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తుందని తెలిపారు. ఈ పథకం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది శ్రీనివాసులు, హరి, రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు