ప్రజలకు ఆరోగ్యం రక్షగా ఇచ్చే ప్రభుత్వం జగన్ ప్రభుత్వం.
విశాలాంధ్ర – కొవ్వూరు : ప్రజల ఆరోగ్యం కోసం తెచ్చిన మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం చేస్తూ ప్రజలకు అన్యాయం చేసేది కూటమి పరిపాలన అని వైసిపి జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ అన్నారు. కొవ్వూరు పట్టణం లో వైసిపి పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జ్ తలారి వెంకట్రావు అధ్యక్షతన శుక్రవారం ప్రజా ఉద్యమం కోటి సంతకాల కార్యక్రమం పై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ కొవ్వూరు నియోజకవర్గం పరిశీలకులు గిరిజాల బాబు నియోజకవర్గంలో నుంచి వైసిపి నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలకు శ్రీకారం చుట్టిందని వాటిలో ఐదు మెడికల్ కళాశాలకు ప్రారంభమయ్యాయి అని చంద్రబాబు అధికారంలో వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం దాన్ని అడ్డుక్కోవడం కోసం వైసిపి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ప్రజా ఉద్యమ కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టారని ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వారికి ప్రైవేటుపరం చేసి తన సొంత ఖాతాను పెంచుకునే దిశగా చంద్రబాబు పాలన కొనసాగుతుందని కోటి సంతకాల సేకరణ ద్వారా ప్రజా వ్యతిరేకతను తెలియజేయడమే ముఖ్య ఉద్దేశం. కొవ్వూరు నియోజకవర్గం లో సుమారు 50, నుండి 60 వేల వరకు సంతకాల సేకరణ 90% పూర్తయిందని డిసెంబర్ ఐదో తారీఖున సంతకాల సేకరణ పత్రాలను జిల్లా పార్టీ కార్యాలయానికి అందజేస్తారని వెంకయ్య నాయుడు విద్యా వైద్యం ఉచిత ఉండాలి కానీ మిగిలిన పథకాలు కాదని తెలిపిన వారికి మెడికల్ కాలేజీ లను ప్రైవేటుపరం చేయటం తప్పని చంద్రబాబుకు తెలియచేయాలన్నారు. ముందు తరాలకు తరగని ఆస్తిగా మెడికల్ కళాశాల ఇవ్వాలని దానికి అందరూ సమరయోధులు లాగా కదలి కోటి సంతకాలు సేకరించాలని అన్నారు. మొందా తుఫాన్ తో నష్టపోయిన రైతులు ఇటువంటి ధాన్యాన్ని తీసుకువచ్చిన కొనుగోలు చేసి వెంటనే డబ్బులు చెల్లించాలని అన్నారు. ఆయన అన్నారు. నియోజకవర్గ ఇన్చార్జ్ తలారి వెంకట్రావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వ ఆస్తులను దారతత్వం చేస్తున్నారని మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ పై కోటికసంతకాలు సేకరించి రాష్ట్ర గవర్నర్ కి అందజేస్తామని ప్రతి సంతకానికి పేరు ఫోన్ నెంబరు తీసుకుంటున్నామని కోటి సంతకాల కార్యక్రమం జరుగుతుందన్నారు అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు


