Homeఆంధ్రప్రదేశ్పనులకు ప్రతిపాదనలు

పనులకు ప్రతిపాదనలు

- Advertisement -

రూ105 కోట్లతో పుష్కర పనులకు ప్రతిపాదనలు

విశాలాంధ్ర – నిడదవోలు : 2027లో జరగనున్న పుష్కర పనులకు రూ 105 కోట్లతో ప్రతిపాదలను పంపినట్లు మున్సిపల్ చైర్పర్సన్ భూపతి ఆదినారాయణ అన్నారు.  నిడదవోలు పురపాలక సంఘ కౌన్సిల్ హాల్లో సాధారణ, అత్యవసర కౌన్సిల్ సమావేశం చైర్ పర్సన్ భూపతి ఆదినారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈనెల 26 27 28 తేదీలలో నిర్వహించిన పురపాలక సంఘ వజ్రోత్సవాలు ఘనంగా  నిర్వహించడంలో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. గ్రేడ్ 2 గా ఉన్న నిడదవోలు పురపాలక సంఘాన్ని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా గుర్తించేందుకు సహకరించిన రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ కు, స్పెషల్ గ్రేడ్ పురపాలక సంఘంగా అనుమతిస్తూ జీవో ఎంఎస్ నెంబర్ 242 జీవోను వజ్రోత్సవ కానుకగా జారీ చేసిన  రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణకు సమావేశముఖంగా కృతజ్ఞతలు తెలిపారు. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా గుర్తించడం వల్ల పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య పెంచుకోవడంతో పాటు, నిధులు అధిక సంఖ్యలో  వస్తాయని దాంతో ప్రజలకు మెరుగైన సేవలను అందించవచ్చునని కమిషనర్ టి కృష్ణవేణి సభ్యులకు వివరించారు. అనంతరం జరిగిన సమావేశంలో పలువురు కౌన్సిలర్లు వీధిలైట్ల నిర్వహణ, పారిశుధ్య పనులపై అధికారులను నిలదీశారు. నామినేటెడ్ పనుల అప్పగింతపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పారు. అజెండాలోని తీర్మానాలను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా వజ్రోత్సవ కండువాలను మెడలో వేసి, మెమొంటోలను కౌన్సిల్ సభ్యులకు భూపతి ఆదినారాయణ అందజేశారు. పురపాలక సంఘం ఏర్పడి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డైమండ్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి కృషిచేసిన చైర్మన్ భూపతి ఆదినారాయణను సభ్యులు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు