విశాలాంధ్ర – దేవరపల్లి : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దిత్వా’ తుపాను ప్రస్తుతం
కారైకాల్‌కు 150 కి.మీ, పుదుచ్చేరికి 250 కి.మీ, చెన్నైకు 350 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ నేపథ్యంలో దేవరపల్లి మండలంలోని రైతులు కోసిన ధాన్యాన్ని సర్వీస్ రోడ్లు, కళ్లాల వద్ద ఉంచకుండా వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మిల్లులకు తరలించాలి అని తహసిల్దార్ శ్రీ కె. శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి శ్రీ కె. కమల్‌రాజ్ రైతులకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రతి సొసైటీ పరిధిలో బరకాలు సిద్ధంగా ఉన్నాయని, అత్యవసర పరిస్థితుల్లో వాటిని ఉపయోగించి రైతులు తమ ధాన్యాన్ని కప్పుకోవాలని సూచించారు. ప్రజలు మరియు రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
దిత్వా తుపాను
- Advertisement -
RELATED ARTICLES


