Homeఆంధ్రప్రదేశ్లబ్ధిదారులకు స్థానికంగా ఇల్లు స్థలాలు

లబ్ధిదారులకు స్థానికంగా ఇల్లు స్థలాలు

- Advertisement -

విశాలాంధ్ర – కొవ్వూరు: కొవ్వూరు మండలం లో మద్దూరు, వాడపల్లి, సీతంపేట గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు స్థానికంగా ఇల్లు స్థలాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ఎంపీపీ కాకర్ల నారాయుడు అన్నారు. ప్రభుత్వ లేఔట్ లలో ఇండ్ల స్థలాలు పొంది, అక్కడకు వెళ్లడానికి సుముఖంగా లేని మద్దూరు, సీతంపేట, వాడపల్లి గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఆయా గ్రామాల్లోనే ప్రభుత్వ నిబంధనల మేరకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు కొవ్వూరు ఎంపీపీ కాకర్ల సత్యనారాయణ(నారాయుడు) అన్నారు. ఎంపీపీ అధ్యక్షతన శనివారం ఎంపిడివో కార్యాలయ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండల తహసీల్దార్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ నందమూరు సమీపంలో ఉన్న కొవ్వూరు లేఔట్ లో ఇండ్ల స్థలాలు పొంది అక్కడకు రావడానికి ఇష్టపడని వాడపల్లి, మద్దూరు, సీతంపేటకు చెందిన లబ్ధిదారులు, తమ పట్టాలను రెవెన్యూ డిపార్ట్మెంట్ కు అందజేస్తే, వారికి ప్రభుత్వ ఆదేశాల మేరకు స్థల సేకరణ అనంతరం వారి గ్రామాలకు సమీపంలో స్థలాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అంతే కాకుండా వేరే లేఔట్ లలో స్థలాలు కావాలంటే ఒక సెంట్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అదే విధంగా మండలంలోని దొమ్మేరు గ్రామంలో పొలాల రీ సర్వే జరుగుతుందని, విస్తీర్ణం తేడా ఉన్నా, ఏదైనా అభ్యంతరాలు ఉన్నా గ్రామ సర్వేయర్ ను కలిసి తెలియజేయాలని అన్నారు. 90 రోజుల అప్లికేషన్ సైట్ తెరిచి ఉందని, ఇండ్ల స్థలాలు కావాలనుకున్న కొత్తగా పెళ్ళైన దంపతులు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. హౌసింగ్ ఏఈ శ్యామ్ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 2014 నుంచి 2019 వరకు ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలో వివిధ దశల్లో ఇళ్ళు నిర్మాణాలు జరిగి ఇంకనూ 751 ఇళ్లకు గాను 2 కోట్ల 38 లక్షల 54 వేల 579 రూపాయల పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు. అదే విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో అర్హులైన 412 మంది లబ్ధిదారులు ఉండగా 361 మంది వివరాలను సర్వే ద్వారా గుర్తించడం జరిగిందని అన్నారు. ఆదివారంతో సర్వే పూర్తి అవుతుందని, అర్హులు ఎవరైనా ఉంటే తమ వివరాలను ఆన్లైన్ చేeసుకోవాలని చూపించారు. వ్యవసాయశాఖ ఏవో గంగాధర్ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా రైతులకు ఈ సమావేశము నందు కొవ్వూరు జడ్పీటీసీ సభ్యులు 4940 మంది రైతులకు రెండవ విడత అన్నదాత సుఖీభవ 3.34 కోట్ల రూపాయలు నిధులు జమ అయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బొంతా వెంకట లక్ష్మి, వైస్ ఎంపీపీపీ వీరమల్ల నారాయుడు, ఎంపిడివో టిబివి ,రమణ, డిప్యూటీ ఎంపిడివో డి. ముత్యం, పంచాయతీ కార్యదర్శులు, వివిదశాఖల అధికారులు, ఎంపిటిసి సభ్యులు, సబ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు