Homeఆంధ్రప్రదేశ్అభివృద్ధి పరుగులు

అభివృద్ధి పరుగులు

- Advertisement -

ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సహకారంతో కుమార్ దేవం ఎత్తిపోతల సంఘం అభివృద్ధి పరుగులు..
ఎత్తిపోతల సంఘం అధ్యక్షులు గొరిజాల వెల్లడి..

విశాలాంధ్ర – కొవ్వూరు : కొవ్వూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సహకారంతో మండలంలోని కుమారదేవం ఎత్తిపోతల సంఘం అధ్యక్షులు గొరిజాల సురేష్ అన్నారు. ఆయన విశాలాంధ్ర ప్రతినిధితో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 1976లో ఈ పథకం ప్రారంభమైంది అన్నారు. ఈ పథకం ద్వారా కుమారదేవం పెనకనమెట్ట,దొమ్మేరు ఆరికరేవుల,కొవ్వూరు ప్రాంతాల రైతులకు 1700 ఎకరాల ఆయుకట్టుకు నీరు అందిస్తున్నామన్నారు . పంపింగ్ స్కీము రైతు సంఘానికి 1998లో నీటిపారుదల సంస్థ అప్పగించిందన్నారు. అప్పటినుండి నేటి వరకు రైతుల సహకారంతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ ఐదు సంవత్సరాల హయంలో పథకం అభివృద్ధి వెనుకబడిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేగం పుంజుకుందన్నారు. 2007వ సంవత్సరంలో కో-ఆపరేటివ్ సొసైటీలో ఏర్పడిందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ ఎత్తిపోతల సంఘం 150 హెచ్పి యంత్రాలసామర్థ్యంతో నీటిని పంపింగ్ చేస్తుందన్నారు. తనతో పాటు మరో పదిమంది రైతులు ఎత్తిపోతల సంఘంలో సభ్యులుగా ఉన్నారన్నారు. రబీ సమయంలో గోదావరిలో నీరుతగ్గి ఇసుక మేటలు వేయడంతో కొంత ఇబ్బంది తలెత్తినా ఆ తరువాత కాలంలో సమస్యను అధిగ మిస్తున్నామని గొరిజాల పేర్కొన్నారు. 2004లో పిడుగు పడి ట్రాన్స్ఫార్మర్ పాడైన గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే సహకారంతో కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నీటి తీరువా బకాయిలు ఉన్నప్పటికీ త్వరలోనే వసూలుచేసి ఎత్తిపోతల సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని ఎత్తిపోతల సంఘం అధ్యక్షులు గొరజాల సురేష్ పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు