- Advertisement -
ల్యాబ్ టెక్నీషియన్ దుర్గాప్రసాద్ కు జిల్లా అవార్డ్
విశాలాంధ్ర – కొవ్వూరు : ఉత్తమ సేవలకు గుర్తింపుగా కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ కు జిల్లా ఉత్తమ ల్యాబ్ టెక్నీషియన్ గా వాజా దుర్గా ప్రసాద్ ఎంపికయ్యారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకొని సోమవారం రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో టీబీ, లెప్పర్స్, ఎయిడ్స్ జిల్లా అధికారి వసుంధర ఆధ్వర్యంలో అభినందనలు తెలియజేసి దుర్గా ప్రసాద్ ను ఘనంగా సత్కరించారు. దుర్గా ప్రసాద్ 2012, 2013, 2023, 2025 ఏడాదిలో నాలుగు సార్లు జిల్లా ఉత్తమ ల్యాబ్ టెక్నీషియన్ గా ఎంపికయ్యారు.


