Homeజిల్లాలుశ్రీ సత్యసాయిబాల్యవివాహాలను అరికట్టాలి..

బాల్యవివాహాలను అరికట్టాలి..

- Advertisement -

తహసీల్దార్ సురేష్ బాబు
విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణ గ్రామీణ ప్రాంతాలలో బాల్య వివాహాలను తప్పనిసరిగా అరికట్టాలని తాసిల్దార్ సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బాల్య వివాహాలపై వివిధ విభాగాల అధికారులకు సమాచారాన్ని ఇవ్వడం జరిగిందన్నారు. బాల్య వివాహాలను అరికట్టి బాల్య వివాహ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ముఖ్యంగా ఐసిడిఎస్ శాఖ వీటిపై ప్రత్యేక దృష్టిని సారించాలని తెలిపారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగినట్లయితే సంబంధిత అధికారులు వెంటనే చొరువ తీసుకొని ఆ వివాహాలను ఆపుదల చేయాలని తెలిపారు. అందుకే కలెక్టర్ ఆదేశాల మేరకు బాల్య వివాహ నిర్మూలనకు నూరు రోజుల అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. బాల్య వివాహాలు జరగకుండా గ్రామం నుంచి వాడు స్థాయిలో సకాలంలో నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు. పాఠశాలలు, ఐసిడిఎస్ కేంద్రాలు, పోలీస్ శాఖ ,గ్రామ, వార్డు స్థాయిలోనే సకాలంలో బాల్యవివాహాల నివారణ చర్యలను తీసుకోవాలని తెలిపారు. బాల్య వివాహాలు చేయడం నేరమని, వివిధ మతాల పెద్దలకు సైతం తెలియజెప్పాలన్నారు. కావున తల్లిదండ్రులు తమ ఆడపిల్లల పట్ల ఉన్నత చదువుకు ప్రోత్సహించాలి తప్ప, బాల్య వివాహాలు చేరాదని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు