మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేష్
విశాలాంధ్ర ధర్మవరం;; ఈనెల 21వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమం పై ప్రజలకు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ ఆధ్వర్యంలో పట్టణములోని ఎల్సికేపురంలో అవగాహన సదస్సును నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ 0-5 సంవత్సరాలు గల పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని, అలాగే 22వ తేదీ 23వ తేదీన గృహ సందర్శ కార్యక్రమం కూడా విజయవంతం చేయాలని వారు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పరిచోట్ల వారు ర్యాలీని నిర్వహించారు. పల్స్ పోలియో వేసుకోవడం వల్ల కలుగు ప్రయోజనాలు, నష్టాలను కూడా ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.
పల్స్ పోలియోపై అవగాహన సదస్సు
- Advertisement -
RELATED ARTICLES


