- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని రావులచెరువులో ఉంటున్న వడ్డే లక్ష్మీదేవి ఇంటిలో రాత్రి దొంగలు పడి బీరువా తెరిచి 20వేల రూపాయలు నగదు తులం బంగారం నగలు చోరీకి గురి అయిందని బాధితురాలు తెలిపారు. ఇంటికి తాళం వేసి పుట్టినిల్లు చెట్టు ఊరుకు వెళ్లిందని గమనించిన దొంగలు తాళం పగలగొట్టి చోరీకి పాల్పడినట్లు వారు తెలిపారు. తదుపరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


