- Advertisement -
నూతన సంవత్సర శుభాకాంక్షల సందర్భంలో మద్యం సేవించిన వారికి ఉచిత రవాణా సౌకర్యం అందించనున్నట్టు తెలంగాణ గిగ్ డ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) ప్రకటించింది.
ఈ సేవ ఈరోజు (డిసెంబర్ 31) రాత్రి 11 గంటల నుండి రాత్రి 1 గంట వరకు అందించబడనుందని వివరించింది.ఈ కార్యక్రమానికి క్యాబ్‌లు, ఆటోలు, ఈ-వీ బైక్‌లను కలిపి మొత్తం 500 వాహనాలు ప్రత్యేకంగా సిద్ధం చేసినట్లు యూనియన్ పేర్కొంది.హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ప్రాంతాల్లో ఈ ఉచిత రైడ్ సౌకర్యం లభిస్తుందని తెలిపారు.ఉచిత రైడ్ పొందేందుకు 8977009804 నంబర్‌కు కాల్ చేయాలని టీజీపీడబ్ల్యూయూ ప్రజలకు సూచించింది.


