విశాలాంధ్ర -ధర్మవరం : శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లలిత నాట్య కళానికేతన్ గురువులు బాబు బాలాజీ రామలాలిత్యా వారు మరోసారి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ను సాధించడం జరిగింది. ఈ సందర్భంగా గురువులు బాబు బాలాజీ, రామరాళిత్య మాట్లాడుతూ డిసెంబర్ 27 వ తేదీ హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో భారత్ ఆర్ట్స్ అకాడమీ వారు నిర్వహించిన కూచిపూడి కళావైభవంలో తాము 25 మంది శిష్య బృందంతో పాల్గొని బృందనాట్యం చేయడం జరిగిందన్నారు. దీంతో ఆ సంస్థ వారు నాలుగుసార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ను సాధించడం జరిగిందని తెలుపుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. గురువులు మాట్లాడుతూ రాష్ట్ర, భారత దేశంలోని పలుచోట్ల నాట్యములు ప్రదర్శించి, ఆయా రాష్ట్ర ప్రజల మండలను పొందుతూ మంచి గుర్తింపు పొందడం మా అదృష్టమని వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు భారత్ ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ధర్మవరం పట్టణ ప్రముఖులు, కళాకారులు, బంధుమిత్రులు, అధికార అనధికార ఆఫీసర్లు గురువులకు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.
మరొకసారి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన శ్రీ లలితా నాట్య కళానికేతన్ గురువులు
- Advertisement -
RELATED ARTICLES


