Homeజిల్లాలుశ్రీ సత్యసాయినేత్రదానం చేయుటలో అపోహాలకు తావు ఇవ్వరాదు.. ఆర్డీవో మహేష్

నేత్రదానం చేయుటలో అపోహాలకు తావు ఇవ్వరాదు.. ఆర్డీవో మహేష్

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; నేత్రదానం చేయుటలో అపోహాలకు తావు ఇవ్వరాదని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని విశ్వదీప సేవా సంఘం వార్షికోత్సవం సేవా సంఘం కార్యాలయం నందు ముఖ్యఅతిథిగా ఆర్డీవో విచ్చేశారు. అనంతరం ఆర్డీవో మహేష్ మాట్లాడుతూ నేత్ర దానం చేస్తే వాటి వలన మరో తరం వారికి మనం ఆదర్శప్రాయులము అవుతామని తెలిపారు. వ్యవస్థాపకులు కోళ్ల మొరం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నేత్ర దానం చేయుటకు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మన భారతదేశంలో ప్రతి సంవత్సరం ఎంతోమంది చూపు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అలాంటివారికి ఈ నేత్రదానం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. నేత్రదానం ద్వారా వారి జీవితాలు లో వెలుగు నింపిన వారము అవుతామని తెలిపారు. తదుపరి నూతన కార్యవర్గాన్ని ప్రకటించడంతో, అధ్యక్షులుగా గాజుల సురేష్, ఉపాధ్యక్షులుగా టీ. చంద్రశేఖర్ రెడ్డి, కార్యదర్శిగా జూజారు రఘు, ఉప కార్యదర్శిగా ప్రభాకర్ రెడ్డి, కోశాధికారిగా ఆదినారాయణ, వీఆర్ఓ గా ఖమ్మం మాధవ తదితర సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. అనంతరం నేత్రదాతల కుటుంబ సభ్యులకు సత్కారమును ఆర్డీవో చేతుల మీదుగా చేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు మధు నాయుడు, వెంకటేష్ ,కేశవరెడ్డి, ఓబులయ్య, ఆక్కులప్ప ,మనోహర్, ధనుంజయ, నాగ వెంకటరమణ, నాగేశం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు