Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా ఎస్ఎఫ్ఐ 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా ఎస్ఎఫ్ఐ 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; ఎస్ఎఫ్ఐ 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పట్టణంలోని తారకరామాపురంలో గల బాలుర సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల నడుమ ఘనంగా విద్యార్థి సంఘం నాయకులు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ విద్యార్థి పెద్దన్న, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నామాలు నాగార్జున, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనాథ్, పట్టణ కార్యదర్శి అమన్ లు జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ ఏర్పడి నాటి నుంచి నేటి వరకు అధ్యయనం, పోరాటం, అనే నినాదాలతో స్వాతంత్ర్యం ప్రజాస్వామ్యం సోషలిజం అనే ఆశయాలతో విద్యార్థుల కోసం అనేక పోరాటాలు చేస్తూ 55 సంవత్సరాలు పూర్తి చేసుకుని 56వ సంవత్సరంలో అడుగు పెట్టిందని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనేకమంది ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఉద్యమం కోసం అమరవీరులు అయినారని వారు గుర్తు చేశారు. నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మతోన్మాద విధానాలతో విద్యలో అనేక మార్పులు తీసుకొని వస్తూ, విద్యార్థులను విద్యార్థి ఉద్యమమును, వారి హక్కుల కోసం పోరాటం చేయకుండా పక్కదారి పట్టిస్తూ, కార్పొరేట్ చదువులు ఉద్యోగాల వైపు మళ్ళిస్తున్నారని వారు మండిపడ్డారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థుల సమస్యల పోరాటం కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు బాలాజీ, వరుణ్ తేజ ,హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు