Homeజిల్లాలుశ్రీ సత్యసాయిదాతలకు ఘన సత్కారం..

దాతలకు ఘన సత్కారం..

- Advertisement -

క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి)
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయంలో గత కొన్ని సంవత్సరాలుగా దాతల సహకారంతో వృద్ధులకు, అనాధలకు, ఒంటరి మహిళలకు నెలకు 200రూపాయలు చొప్పున పింఛను పంపిణీ చేస్తున్నామని క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి) తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆలయంలో 150 మందికి 200 రూపాయలు చొప్పున పెన్షన్ను పంపిణీ చేశారు. ఇంతవరకు దాతల సహకారంతో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఐదు మంది దాతలను ఘనంగా పింఛన్దారుల నడుమ ఘనంగా సత్కరించారు. చిట్టి మాట్లాడుతూ మేము ఇచ్చే పెన్షన్ అతి తక్కువ డబ్బు అయినా, ఏదో ఒకదానికి వాడుకునే అవకాశం నేటి కాలంలో ఉందన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. అంతేకాకుండా ఆలయం కమిటీ ఆధ్వర్యంలో కూడా ప్రతినెలా ఉచిత వైద్య శిబిరాలతో పాటు ఉచితంగా మందులను కూడా పంపిణీ చేస్తున్నట్లు వారి తెలిపారు. దాతలు మాట్లాడుతూ ఆలయ కమిటీ వారు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తిని ఇస్తాయని తెలుపుతూ, మమ్ములను ఈ విధంగా అమ్మవారి సన్నిధిలో సన్మానించుట అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దాసరి మంజునాథ్, చందా ప్రసాద్, బండారు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు