Homeజిల్లాలుకర్నూలుసీపీఐ శత వసంతాల వేడుకలను జయప్రదం చేయండి

సీపీఐ శత వసంతాల వేడుకలను జయప్రదం చేయండి

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : సీపీఐ శత వసంతాల వేడుకలను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, సహాయ కార్యదర్శి మునెప్ప పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలోని స్థానిక సిపిఐ కార్యాలయం నందు సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశం మండల కార్యదర్శి వీరేష్ అధ్యకతన జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, సహాయ కార్యదర్శి మునెప్ప, కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఐ 1925 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుందని తెలిపారు. నేడు ప్రమాదకర పరిస్థితుల్లో శ్రామిక వర్గ ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఏ రూపంలో ఉన్న కమ్యూనిస్టులందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కమ్యూనిస్టులు సిద్ధం కావాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా మహిళలకు 1500 రూపాయలు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కింద 3000 రూపాయలు, నిరుపేదలకు మూడు సెంట్లు స్థలం ఇవ్వడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా 20 వేల రూపాయలు, ఉల్లి రైతులకు హెక్టార్ కు 50 వేల రూపాయలు ఇస్తామని అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడం కూటమి ప్రభుత్వానికే చెల్లిందని ఆరోపించారు. ఈనెల 18న ఖమ్మంలో జరిగే సిపిఐ శత జయంతి వేడుకలకు లక్షలాది మంది పాల్గొంటారని తెలిపారు. కావున మండలం నుంచి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ, సిపిఐ మండల సహాయ కార్యదర్శులు కుమ్మరి చంద్ర, తిక్కన్న, నాయకులు నాగరాజు, వీరేష్, హుస్సేన్ బాషా, గోపాల్, సర్దార్ పటేల్, హనుమంతు, కమిటీ సభ్యులు రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు