Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం:: వైయస్సార్ సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బెదిరింపులు, దౌర్జన్యాలతో పెట్టుబడులు రాకుండా చేశారని.. ఇప్పుడు అధికారం పోయాక కూడా అదే దోరణితో వ్యవహరిస్తున్నారని వైసీపీ అధినేత జగన్ పై ధర్మవరం తెదేపా ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ విమర్శలు చేశారు. ధర్మవరం పార్టీ కార్యాలయంలో ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. తాడిమర్రి, ధర్మవరం, బత్తలపల్లి, ముదిగుబ్బ మండలాలకు చెందిన 33మంది లబ్ధిదారులకు 12లక్షల 90 వేల రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాలు, గ్రామాల ముఖ్య నాయకుల పాల్గొన్నారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు శ్రీరామ్ తోపాటు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇంత పెద్ద ఎత్తున సాయం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజల తరుఫున కృతజ్ఞతలు తెలియజేశారు. పేద వర్గాలను దృష్టిలో ఉంచుకుని.. మెడికల్ కళాశాలల నిర్మాణాన్ని వేగవంతంగా చేయాలని పీపీపీ మోడల్లో చేపడితే దాన్ని జగన్ రెడ్డి అడ్డుకుంటున్నారన్నారు. టెండర్ల ప్రక్రియలో పాల్గొంటే అరెస్టులు చేస్తామని బెదిరిస్తున్నారన్నారు. ఇప్పటికే ప్రజలు 11సీట్లకు పరిమితం చేశారని.. రానున్న రోజుల్లో అవి కూడా లేకుండా చేస్తారని శ్రీరామ్ స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు