విశాలాంధ్ర నల్లచెరువు.. నల్లచెరువు మండలంలోని పంతులు చెరువు పంచాయతీ తెలగుట్లపల్లిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంట్లోని వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు, తెలగుట్లపల్లిలో నివాసం ఉంటున్న వనం హనుమంత్ రెడ్డికి చెందిన ఇంట్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హనుమంత్ రెడ్డి మంగళవారం పొలం వద్దకు వెళ్లగా, ఆయన భార్య దీర్ఘకాలిక అనారోగ్యంతో ఇంట్లో మంచానికే పరిమితమై ఉన్నారు. మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో విద్యుత్ మీటర్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగి, పక్కనే ఉన్న బట్టలకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో టీవీ, వాషింగ్ మెషిన్, రెండు మంచాలు, పరుపులు, బట్టలు, టేబుల్ ఫ్యాన్, వంట సామాగ్రి తదితర గృహోపకరణాలు పూర్తిగా కాలిపోయాయి. అలాగే ఇంటి పైకప్పు కూడా పూర్తిగా దెబ్బతిన్నట్లు బాధితులు తెలిపారు. ఈ అగ్నిప్రమాదంలో దాదాపు రూ.3 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇంట్లోని వస్తువులు దగ్ధం..
- Advertisement -
RELATED ARTICLES


