విశాలాంధ్ర ధర్మవరం;; జాతీయస్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో పాల్గొనే అండర్ – 17 ఆంధ్రప్రదేశ్ బాస్కెట్బాల్ స్కూల్ గేమ్స్ జట్టుకు ధర్మవరం బాలబాలికలు ఎంపిక కావడం జరిగిందని ఉమ్మడి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి, యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయ చంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో జనవరి 09తేదీ నుండి 13 తేదీ వరకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రాజ నంద గౌడ్ నగరంలో జరిగే 69 వ నేషనల్ స్కూల్ గేమ్స్ అండర్ _17 జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ బాస్కెట్బాల్ జట్టుకు ధర్మవరం పట్టణానికి చెందిన కార్తిక్ నాయక్ ఎంపిక కావడం గర్వకారణమని తెలిపారు.గత నెల నందు నూజివీడు పట్టణంలో జరిగిన జిల్లా జట్టు కు ప్రాతినిత్యం వహించి రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపి ఆంధ్ర ప్రదేశ్ జట్టుకు ఎంపికయ్యారు అని తెలిపారు. వీరి ఎంపిక పట్ల సెట్టిపి జయచంద్రారెడ్డి తో పాటు ధర్మాంబా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మేడాపురం రామి రెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హిదయ తుల్లా, కోచ్ సంజయ్ , ప్రభుత్వ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు నాగేంద్ర తదితరులు హర్షం వ్యక్తం చేశారు.జాతీయ స్థాయిలో వీరు రాణించి ధర్మవరం పట్టణమునకు పేరు ప్రతిష్టలు తేవాలని వారు ఆకాంక్షించారుఎంపికైన క్రీడా కారుడు బయల్దేరి చత్తీస్గడ్ కి వెళ్లారు అని తెలిపారు.
బాస్కెట్ బాల్ స్కూల్ గేమ్స్ జట్టుకు ధర్మవరం బాల బాలికలు ఎంపిక
- Advertisement -
RELATED ARTICLES


