- Advertisement -
విశాలాంధ్ర-తాడిపత్రి: పట్టణంలోని సిపిఐ కార్యాలయం వద్ద సోమవారం నియోజకవర్గ కార్యదర్శి టి. రంగయ్య, పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ ఆధ్వర్యంలో చలో ఖమ్మం వాల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఐ పార్టీ వందేళ్ళ ప్రస్థానం ముగింపు సందర్భంగా ఈనెల 18వ తారీఖున ఖమ్మం లో జరుగు మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సహాయ కార్యదర్శి నాగేంద్ర, రత్నమయ్య, శీనా, రమణ పాల్గొన్నారు.


