Homeజిల్లాలుశ్రీ సత్యసాయిభూసమస్యల పరిష్కారంలో వేగం పెంచండి

భూసమస్యల పరిష్కారంలో వేగం పెంచండి

- Advertisement -

రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత

విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం డివిజన్ పరిధిలోని రాప్తాడు నియోజకవర్గంలోని మూడు మండలాల పరిధిలో ఉన్న భూసమస్యలకు వేగంగా పరిష్కారం చూపించాలని ధర్మవరం ఆర్డీఓకు ఎమ్మెల్యే పరిటాల సునీత విజ్ఞప్తి చేశారు. భూ సంబంధిత సమస్యల పరిష్కారంపై ధర్మవరం ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించే రెవెన్యూ క్లినిక్ కార్యక్రమానికి పరిటాల సునీత రావడం జరిగింది. ఆర్డీఓ మహేష్ ను కలిసి ప్రస్తుతం పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ నేపథ్యంలో రైతుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను వివరించారు. భూ వ్యత్యాసాలు, భూ వర్గీకరణ, విస్తీర్ణంలో మార్పులు, చేర్పులు సర్వే నంబరు తప్పిదాలు, జాయింట్ ఎల్పీఎంలు, మిగులు భూములువంటి వాటి గురించి వివరించారు. ఈ సమస్యల పరిష్కారంపై తహసీల్దార్లు, వీఆర్ఓలు ఇతర సిబ్బంది వేగంగా పని చేసేలా చూడాలని కోరారు. రైతులకు వీటిపై అవగాహన కల్పిస్తూ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలన్నారు. దీనిపై ఆర్డీఓ కూడా సానుకూలంగా స్పందించారు. కొన్నింటికి అసైన్మెంట్ కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఆర్డీఓ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ భూఆధారిత సమస్యల పరిష్కారంపై ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందన్నారు. అసైన్మెంట్ కమిటీ ఏర్పాటు చేయాలని ఇప్పటికే రెవెన్యూ మంత్రికి విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. గత ప్రభుత్వంలో రీసర్వే పేరుతో భూముల రికార్డులను అస్తవ్యస్తం చేశారన్నారు. పైగా తన సొమ్ము ఏదో ఇచ్చినట్టు పాసుబుక్కుల్లో జగన్ రెడ్డి తన ఫోటో వేసుకున్నారని విమర్శలు చేశారు.
ఆ రోజు ఐఏఎస్ లు ఎందుకు దీనికి అడ్డు చెప్పలేదో అర్థం కావడం లేదన్నారు. మా ప్రభుత్వం వచ్చాక సమస్యల్ని పరిష్కరిస్తూ రాజముద్రతో పాసుపుస్తకాలు ఇస్తున్నామన్నారు. గతంలో జరిగిన తప్పుల్ని సరి చేస్తున్నామని.. ఇది రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జాయింట్ గా ఉన్న భూముల విషయంలో రైతులు ఒక నిర్ణయానికి రావాలని.. వీటిపై పంతంతో ఉంటే మీ పేరుతో ఎక్కువ భూములు చూపిస్తాయన్నారు. దాని వలన మీకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అందకపోవచ్చని అన్నారు. పరస్పరం అంగీకారంతో మీరు అధికారుల వద్దకు వెళ్తే.. మీరు మీకున్న పొలం ప్రకారం పట్టాదారు పాసుపుస్తకాలు తీసుకునే అవకాశం ఉంటుందని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు